పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఖండించారు. ప్రాజెక్టు ఎత్తు ఒక్క మిల్లీ మీటర్ కూడా తగ్గబోదంటూ తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఈ రోజు పరిశీలించిన సీఎం వైఎస్ జగన్ అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరంపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం వైఎస్ జగన్.. డీపీఆర్ ప్రకారమే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని మరో […]