ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వద్ద దీర్ఘకాలంగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాసరావుకు, ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్లల్లో ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్లో మూడోరోజూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. విజయవాడలోని శ్రీనివాసరావు ఫ్లాట్లో కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్లోని చంపాపేట్ గ్రీన్పార్క్ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్కు శ్రీనివాస్ ను తరలించారు. సీఆర్పీఎఫ్ భద్రత నడుమ ఫ్లాట్లో […]