జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటవ్గా నిర్థారణ అయినట్లు జనసేన పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఓ లేఖను జనసేన పార్టీ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఫాం హౌస్లో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని పేర్కొంది. ఈ నెల 3వ తేదీన తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రత్న ప్రభకు మద్ధతుగా పవన్ ర్యాలీ, బహిరంగసభ […]