జనసేన ఆవిర్భావ సభలో ప్రసంగించిన ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎప్పటిలాగానే వైఎస్సార్ సీపీని విమర్శించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో సోమవారం జరిగిన సభలో రాష్ట్రంలో అన్ని పార్టీలకు, నాయకులకు నమస్కారం అంటూ ప్రసంగం ప్రారంభించిన పవన్ అర్థంలేని విమర్శలతో వైఎస్సార్ సీపీపై దాడి చేశారు. తనకు వైఎస్సార్ సీపీ పాలసీపైనే ద్వేషం.. పార్టీ, నేతలపై కాదు అని చెప్పుకుంటూనే అందుకు విరుద్ధంగా విమర్శలు గుప్పించారు. 32 మంది భవననిర్మాణ […]