నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాపీ మూవీస్ బ్యానర్పై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన చిత్రం `రూలర్`. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో… సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ మాట్లాడుతూ – “జైసింహా తర్వాత అదే కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకు నేను సినిమాటోగ్రఫీ అందించడం హ్యాపీగా ఉంది. అలాగే కల్యాణ్గారి బ్యానర్లో మూడో సినిమా చేస్తున్నాను. బాలకృష్ణగారు అద్భుతంగా నటించారు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను“ అన్నారు. […]