అనంతపురం జిల్లాలోనే కాక కర్ణాటక రాష్ట్రంలోకూడా ప్రసిద్ధి చెందిన నసనకోట ముత్యాలమ్మ దేవాలయం ఎట్టకేలకు రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. గత 27 సంవత్సరాలుగా పరిటాల కుటుంబీకుల ఆధీనంలో ఉన్న ఈ దేవాలయానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం శుక్రవారం ఆలయ ఈవో గా బివి నర్సయ్య భాద్యతలు చేపట్టాడు. పరిటాల కుటుంబం గత 25 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులుగా ఉండడంతో ఈ ఆలయం వారి ఆధీనం లోనే ఉంటూ వస్తుంది ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే 1992 నుండి […]