గత శుక్రవారం చేపల మార్కెట్ ని తలపించేలా ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేసిన చిన్న సినిమాలు ఏవీ కమర్షియల్ పరంగా చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేకపోయాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ముఖచిత్రం, పంచతంత్రం లాంటివి ప్రత్యేకంగా అనిపించినా వాతావరణ పరిస్థితుల వల్ల జనం పెద్దగా థియేటర్లకు రాలేకపోయారు. ఇప్పుడు డిసెంబర్ 16 రానుంది. అవతార్ 2కు భయపడి చెప్పుకోదగ్గ రిలీజులేవి ప్లాన్ చేయలేదు. శాసనసభ అనే మల్టీ లాంగ్వేజ్ మూవీ ఒకటి వస్తోంది కానీ దాని మీద ఏమంత […]
నిన్న చాలా సినిమాలు రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద సందడి కనిపించింది. పేరుకి పదికి పైగానే విడుదలైనా జనాల దృష్టి పడిన వాటిలో ముఖచిత్రం ముందువరసలో ఉండగా పంచతంత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని నమ్ముకుని వీకెండ్ మీద ఆశలు పెట్టుకుంది. సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం పికపయ్యే సూచనలు కనిపించడం లేదు. పబ్లిసిటీ లోపం వల్ల విజయానంద్ ప్రేక్షకుల దాకా వెళ్లలేకపోయింది. లెహరాయి లాంటి వాటిని ఎవరూ పట్టించుకోలేదు. గత వారం రిలీజై నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ […]
ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయి పిల్లలు స్మార్ట్ ఫోన్లలో మునిగితేలుతున్నారు కానీ ఇవేవి లేని రోజుల్లో బాల్యమంతా ఎన్నో అందమైన కథలతో గడిచిపోయేది. మరీ ముఖ్యంగా పంచతంత్ర కథలు పెద్దలు చెబుతుంటే వయసుతో సంబంధం లేకుండా అందరూ చెవులు రిక్కించి వినేవాళ్ళు. ఎన్నో టీవీ సీరియల్స్ రూపొంది మంచి విజయం సాధించాయి. దాన్నే టైటిల్ గా పెట్టుకుని ఇవాళో సినిమా థియేటర్లలో అడుగుపెట్టింది. హర్ష పులిపాక దర్శకత్వంలో అయిదు కథల సమాహారంగా రూపొందిన మల్టీ స్టోరీ కాన్సెప్ట్ ఇది. […]
మాములుగా ప్రతి శుక్రవారం మూడు నాలుగు కొత్త రిలీజులు వస్తేనే మూవీ లవర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అంచనాలు లేనివి లైట్ తీసుకుని మిగిలినవాటికి థియేటర్లకొస్తారు. కానీ ఏకంగా 15 సినిమాలు బాక్సాఫీస్ మీదకు కలబడితే దాన్నేమనాలి. డిసెంబర్ 9 దీనికి వేదిక కాబోతోంది. అవేంటో చూద్దాం. గాడ్ ఫాదర్ తో యాక్టర్ గా తన స్థాయిని పెంచుకున్న సత్యదేవ్ మొదటిసారి తమన్నాతో జట్టు కట్టిన ‘గుర్తుందా శీతాకాలం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే చాలా వాయిదాల తర్వాత […]