ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయి పిల్లలు స్మార్ట్ ఫోన్లలో మునిగితేలుతున్నారు కానీ ఇవేవి లేని రోజుల్లో బాల్యమంతా ఎన్నో అందమైన కథలతో గడిచిపోయేది. మరీ ముఖ్యంగా పంచతంత్ర కథలు పెద్దలు చెబుతుంటే వయసుతో సంబంధం లేకుండా అందరూ చెవులు రిక్కించి వినేవాళ్ళు. ఎన్నో టీవీ సీరియల్స్ రూపొంది మంచి విజయం సాధించాయి. దాన్నే టైటిల్ గా పెట్టుకుని ఇవాళో సినిమా థియేటర్లలో అడుగుపెట్టింది. హర్ష పులిపాక దర్శకత్వంలో అయిదు కథల సమాహారంగా రూపొందిన మల్టీ స్టోరీ కాన్సెప్ట్ ఇది. […]