ఏపీ 24/7 ఛానెల్ చైర్మన్ పి. మరళీకృష్ణం రాజు తన పదవికి రాజీనామా చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు, రాష్ట్రేతర తెలుగు ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఇప్పటి వరకూ ఆదరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఛానెల్లో నెలకొన్న పరిస్థితులను ఆ లేఖలో వెల్లడించారు. ఇప్పటికే మీడియా రంగం కష్టాల్లో ఉందని చెప్పిన కృష్ణం రాజు.. తమ ఛానెల్ అసాధారణ పరిస్థితుల్లోకి వెళ్లిందని తెలిపారు. కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం, ఇతర బకాయలు పేరుకుపోవడంతోపాటు.. ఉన్నతస్థాయి ఉద్యోగుల […]