ఢిల్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలవడం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతోంది. ఈనేపధ్యంలో ఢిల్లీ పిసిసి ఇంచార్జ్ గా ఉన్న పీసీ చాకో తన పదవికి రాజీనామా చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఒకప్పుడు వరుసగా 3 సార్లు విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరుస పరాభవాలు చవిచూస్తూ పరువు పోగొట్టుకుంటుంది. మాజీ సియం దివంగత నేత షీలా దీక్షిత్ హాయాంలోనే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని పీసీ చాకో విమర్శలు చేశారు. […]