ఆన్ లైన్ షాపింగ్ ప్రియులకు ఇది నిజంగా శుభవార్తే.. ఎందుకంటే వచ్చేవారం భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ డే 2022 సేల్ ప్రారంభం కానుంది. జూలై 23న శనివారం ఉదయం 12:00 గంటలకు మొదలయ్యే ఈ సేల్.. మరుసటి రోజు జూలై 24న ముగుస్తుంది. ఇప్పుడు ఈ సేల్ లో అదిరిపోయే ఆఫర్లతో ముందుకొస్తున్నాయి టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు. వన్ ప్లస్ ఈ సేల్ లో రూ.37,999 ఉన్న వన్ ప్లస్ 9 సిరీస్ 5జీపై దాదాపు రూ.15,000 వరకు తగ్గింపు పొందవచ్చు. వన్ ప్లస్ 10ఆర్ 5జీ, వన్ ప్లస్ 10ప్రో 5జీపై 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ, కూపన్లపై రూ.4000, ఎక్స్ ఛేంజ్ […]
ఆన్లైన్ వ్యాపారం విస్తృత మయ్యాక ప్రతీ వస్తువును అక్కడినుంచే తెప్పించుకోవడం అలవాటు బాగా పెరిగింది. హెయిర్ పిన్ను మొదలకుని తినే ఆహారం వరకు కొనుక్కునేందుకు ఇప్పుడు అనుసరిస్తున్నది ఆన్లైన్ విధానమే. జనానికి సౌలభ్యం పెంచుతుండడంతో దీనికి లభిస్తున్న ఆదరణ ఏ రోజుకారోజు పెరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు విద్రోహశక్తులకు కూడా ఇదే అవకాశం కాబోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ ద్వారా వచ్చే వస్తువులు ఏ మాత్రం ఉపయోగపడకపోయినా వాటిని తిరిగి పంపించడమో, పక్కన పడేయమో చేస్తుంటారు. […]