మనకు ఇష్టమైన దృశ్యాన్ని శాశ్వతంగా బందించడమే ఫొటో. సెల్ఫోన్లు వచ్చి ఫొటోకి విలువ లేకుండా పోయింది. ఒకప్పుడు ఫొటో అంటే చాలా పెద్దపని. స్టూడియోకి వెళ్లి, అక్కడ అద్దంలో తల దువ్వుకుని, పౌడర్ పులిమి మనకి కావాలంటే కోటు, టై కూడా స్టూడియోలోనే ఇచ్చేవారు. టిప్టాప్గా తయారై కూర్చుంటే, ఒకటికి నాలుగుసార్లు రెడీ అని చెప్పి, స్మైల్ అని అరిచి, పెద్దపెద్ద లైట్లు వేసి కెమెరామన్ నల్లటి దుప్పటిలోకి దూరి క్లిక్మనిపించేవాడు. ఆ తర్వాత వారం రోజులు […]