కొండ పొలానికి వెళ్ళడానికి, తిరిగి వచ్చాక ఆ జ్ఞాపకాల తడి ఆరబెట్టుకోవడానికి, ఆ మార్మికత నుండి బయటకు రావడానికి చాలా ధైర్యం కూడగట్టుకోవలసి వచ్చింది. నాతో పాటు నా పదేళ్ళ కొడుకునీ తీసుకుపోయాను. గత వారం రోజులుగా ఇదే అర్నవ్ బెడ్ టైం స్టోరీ. నేను కథ చెబుతుంటే, తన నుండి వచ్చిన ప్రశ్నలు, సంశయాలు, ఎగ్జయిట్ మెంట్ చూస్తుంటే ఈ కథ గొప్పతనం మరో మారు రుజువయింది. అందులోనూ నాకు చాలా ఇష్టమయిన సీమ మాండలీకం. […]