మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత అన్నాడీఎంకేలో చిచ్చు రాజుకుంటోంది. పార్టీ ఘోరపరాజయానికి నాయకత్వలోపమే కారణమని పార్టీ శ్రేణులు భావిస్తున్న తరుణంలో.. పార్టీపై పట్టు సాధించేందుకు శశికళ ఈ నెల 4వ తేదీన జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. తొలివిడతగా దక్షిణ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. శశికళతో ఎవరూ భేటీ అవ్వొద్దని, ఆమె పర్యటనకు నేతలు దూరంగా ఉండాలంటూ ఇప్పటికే అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్సెల్వం, కో ఆర్డినేటర్ పళనిస్వామిలు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. అయితే పార్టీ ఆదేశాలను పట్టించుకోకుండా […]