జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి సారి స్పందించారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలపై దేశ వ్యాప్తంగా ఓ వర్గం ప్రజల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. వీటిని వ్యతిరేకిస్తూ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి. పలు రాష్ట్రాలు ఆయా చట్టాలను అమలు చేయబోమని ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కూడా ఎన్పీఆర్పై తన వైఖరిని వెల్లడించడం విశేషం. ఎన్పీఆర్లో ప్రతిపాదించిన కొన్ని ప్రశ్నలు […]
దేశ వ్యాప్తంగా సీఏఏ, ఎన్ఆర్సీ వ్యతిరేక, అనుకూల ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రతి పార్టీ ఏదో ఒక వైపు తమ స్టాండ్‌ను తీసుకుంది. ఏపీలో అధికార వైఎస్సార్సీపీ కూడా ముస్లింలకు నష్టం చేకూర్చే విధానాలకు మద్దతు తెలపబోమని స్పష్టం చేసింది. సీఎం వైఎస్ జగన్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అయితే టీడీపీ మాత్రం అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి విధానాన్ని ప్రకటించలేదు. బీజేపీకి దగ్గరయ్యే పనిలో ఉన్న చంద్రబాబు.. ఇంతవరకు ఆ అంశంపై మాట్లాడిన దాఖలాలు లేవు. అక్కడక్కడా […]
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈసారి ఎలాగైనా అధికారంలోకి కైవసం చేసుకోవడానికి సర్వ శక్తులు ఒడ్డి పోరాడినప్పటికీ ఈరోజు విడుదలౌతున్న ఫలితాలలో AAP భారీ మెజారిటీతో విజయం సాధించి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలు బిజెపికి వ్యతిరేకంగా ఒక్కసారిగా తమ స్వరాన్నిపెంచాయి. తాజాగా బిజెపి ఓటమి రూపంలో మోడీపైనా పోరాడడానికి కాంగ్రెసేతర విపక్షాల చేతికి ఆయుధం దొరికినట్టయింది. ఈనేపథ్యంలో అందివచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ ఉదయం […]
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిరసనలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభల సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంగించారు. ప్రభుత్వ విజయాలు, లక్ష్యాలను రాష్ట్రపతి సభలో ప్రస్తావిస్తున్న సమయంలో ప్రతిపక్షాలు సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ తదితర పార్టీల సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఈ చట్టాల […]
రాష్ట్రాభివృద్ధి, ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా వివిధ అంశాలను అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తెచ్చినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు. గురువారం పార్లమెంట్ భవనంలో అఖిలపక్ష సమావేశానికి హాజరైన అనంతరం వైఎస్సార్ సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. మైనారిటీ సోదరుల్లో అభద్రతకు కారణమైన ఎన్పీఆర్, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పామని వైఎస్సార్ సీపీ లోక్ సభా పక్ష నేత మిథున్‌రెడ్డి తెలిపారు. వీటిపై సభలో […]
ప్రశాంత్ కిషోర్, ఈ పేరు భారతదేశ రాజకీయ సర్కిల్స్ లో తెలియని వారు ఉండరు, తన వ్యూహ చతురతతో ప్రత్యర్ధి పార్టీలను మట్టి కరిపించగల జట్టి గా చూస్తారు,అనేక జయాలు, అతికొద్ది అపజయాలతో దూసుకుపోతున్న ప్రశాంత్ కిషోర్ ఆ తరువాత తన రాజకీయ ప్రస్థానం జే.డి.యు పార్టీ నుండి ప్రారంభించారు. నితీష్ కుమార్ అధ్యక్షుడిగా ఉన్న ఆ పార్టీకి ఉపాధ్యక్షుడి హోదాలో సేవలు అందించారు. అయితే కొంత కాలంగా జే.డి.యు మిత్ర పక్షంగా ఉన్న బి.జే.పి పై […]
భారతదేశమంతటా అశాంతి కనిపిస్తోంది. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో ప్రారంభించిన ఎన్నార్సీ మంటలు దేశమంతటా వ్యాపించాయి. నిత్యం లక్షల మంది ఆందోళనల్లో కనిపిస్తున్నారు. అన్ని మూలలా ఆగ్రహ జ్వాలలు కనిపిస్తున్నాయి. అనేక రాష్ట్రప్రభుత్వాలు సైతం ఈ నిరసనలకు దిగివచ్చాయి. అసెంబ్లీలలో తీర్మానాలు చేసి సీఏఏ, ఎన్నార్సీ అమలు చేసేది లేదని చెబుతున్నాయి. అసలు ఇలాంటి తీవ్ర పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్నదే ప్రశ్న. భిన్న సమూహాల సమాహారమైన దేశంలో అనేక తరగతులు తల్లడిల్లిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నదే అందరం ఆలోచించాల్సిన […]
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు ఈ చట్టాన్ని ఆమోదించిన నాటి నుండి అట్టుడుకుతున్నాయి. ఢిల్లీ,పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ మొదలైన రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎన్ఏఏ, ఎన్ఆర్సీ బిల్లును తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని కేరళ,మధ్య ప్రదేశ్,పశ్చిమ బెంగాల్,బీహార్,ఆంధ్ర ప్రదేశ్,మహారాష్ట్ర,జార్ఖండ్ రాష్ట్రాలు తేల్చి చెప్పాయి. సాక్షాత్తు అస్సాం మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన సైదా అన్వరా తైమూర్ […]
దేశంలో అనేక నిరసనలకు కారణం అవుతున్న కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద ఎన్ఆర్సీ, సీఏఏపై చర్చించేందుకు కాంగ్రెస్ సోమవారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని తలపెట్టింది. అయితే ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకుండా విపక్షాలు ఆఖరికి కాంగ్రెస్ మిత్ర పక్షాలు కూడా షాకిచ్చాయి. ప్రస్తుతం దేశంలో సాగుతున్న అల్లర్లకు కారణమయిన ఎన్ఆర్సీ, సీఏఏపై చర్చించడానికి ముందుకు రావాలని విపక్షాలను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. కాగా ఈ అఖిల పక్ష సమావేశానికి హాజరు కాకుండా ప్రధాన విపక్ష పార్టీలు […]
ఒకపక్క ఎన్ఆర్సి కి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు మరి ముఖ్యంగా అస్సాం అంతా అట్టుడుకుతున్న తరుణంలో స్వయానా అస్సాం రాష్ట్రానికి ఏకైక మహిళా ముఖ్యమంత్రిగా చేసిన సైదా అన్వరా తైమూర్ పేరు ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి) లో లేకపోవడం ఇప్పుడు అస్సాంలోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మాజీ కాంగ్రెస్ నాయకురాలైన సైదా అన్వరా తైమూర్ అస్సాంలోనే కాక యావత్ భారత దేశంలోనే తొలి ముస్లిం ముఖ్యమంత్రి కావడం గమనార్హం […]