నివర్ తుపాను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలలో జరుగుతున్న రక్షణ చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తుపాను ప్రభావం రాష్ట్రంలో ఏ స్థాయిలో ఎక్కెడెక్కడ ఉందో సీఎంవో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తుపాను ప్రభావం నెల్లూరు జిల్లాలపై అధికంగా ఉన్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. నెల్లూరు సగటును ఏడు సెంటీమీటర్ల వర్షం కురిసిందని వివరించారు. గత మూడు రోజులుగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయని పేర్కొన్నారు. […]