వైసీపీ యువనాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరోసారి తన సత్తాను నిరూపించుకున్నారు. నందికొట్కూరులో ఏ ఎన్నికైనా విజయం వైసీపీదేనని, పార్టీలో ఎన్ని వర్గాలు ఉన్నా.. తనదే పైచేయని మరోమారు చాటారు. తాజాగా వెలువడిన నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులతోపాటు, తన వర్గంగా స్వతంత్రగా పోటీ చేసిన వారిని బైరెడ్డి గెలిపించుకున్నారు. 29 వార్డులున్న నందికొట్కూరు మున్సిపాలిటీలో నాలుగు వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగతా 25 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. కౌన్సిలర్ సీట్ల విషయంలో ఎన్నికలకు ముందు […]