శాసన సభలో వైఎస్సార్సీపీ సభ్యుల మాటల తూటాలకు తమ సభ్యులు ఎదురు దాడి చేసినా నిరుత్సాహ పరిస్థితి ఉన్న నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి శాసన మండలిలో మాత్రం మంచి ఊరట లభించింది. నిన్న మంగళారం శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరు చంద్రబాబుకు అమితానందాన్ని కలిగించినట్లుంది. తన సంతోషాన్ని ఈ రోజు ఆయన టీడీపీ ఎమ్మెల్సీలతో పంచుకున్నారు. వారిని అభినందించి ఈ రోజు మరింత జోరుతో వ్యవహరించేలా ఉద్యుక్తులను చేశారు. తన […]