తెలంగాణ రాష్ట్రంలో పురపోరు మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది. 120 మున్సిపాలిటీలు, 9 మున్సిపల్ కార్పొరేషన్లకు నేడు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 2,647 వార్డులకు 11,099 అభ్యర్థులు, 324 డివిజన్లకు 1,744 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల పరిధిలో 40,40,582 మంది, కార్పొరేషన్ల పరిధిలో 13,15,360 మంది ఓటర్లున్నారు. 25న ఫలితాలు.. 7,961 పోలింగ్ కేంద్రాల్లో తెలుపు రంగు […]