iDreamPost
android-app
ios-app

విజయ్ ఆంటోని పొలిటికల్ డ్రామా.. ఏ OTT లో అంటే

  • Published Oct 15, 2025 | 12:15 PM Updated Updated Oct 15, 2025 | 12:15 PM

హిట్స్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీసే హీరోలలో విజయ్ ఆంటోని కూడా ఒకరు. ఏడాదిలో ఎంత లేదని కనీసం మూడు నాలుగు సినిమాలు వస్తూ ఉంటాయి. అలాగే విజయ్ సినిమాలు థియేటర్ రిలీజ్ తర్వాత ఓ నెల లోపే ఓటిటి లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో రీసెంట్ గా విజయ్ నటించిన ఓ పొలిటికల్ డ్రామా ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది.

  • Published Oct 15, 2025 | 12:15 PMUpdated Oct 15, 2025 | 12:15 PM
విజయ్ ఆంటోని పొలిటికల్ డ్రామా.. ఏ OTT లో అంటే

హిట్స్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీసే హీరోలలో విజయ్ ఆంటోని కూడా ఒకరు. ఏడాదిలో ఎంత లేదని కనీసం మూడు నాలుగు సినిమాలు వస్తూ ఉంటాయి. అలాగే విజయ్ సినిమాలు థియేటర్ రిలీజ్ తర్వాత ఓ నెల లోపే ఓటిటి లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో రీసెంట్ గా విజయ్ నటించిన ఓ పొలిటికల్ డ్రామా ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమా కథేంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. విజయ్ ఆంటోని ఓ సెక్రటేరియట్ లో బ్రోకర్ గా పని చేస్తూ ఉంటాడు. ఎలాంటి పని అయినా చాలా త్వరగా చేసేస్తూ ఉంటాడు. అలా ఓ సారి ఓ ప్రముఖ మంత్రికి సంబందించిన వ్యాపారంలో వేలు పెడతాడు. అది సుమారు రూ.800 కోట్ల భూముల వ్యవహారం. ముందుగా మాట్లాడుకున్నట్టే అంతా అనుకున్న సమయానికి జరుగుతూ ఉంటుంది. కానీ చివరిలో అనుకోకుండా ఓ ఎంఎల్ఏ హత్యకు గురవుతాడు. దాని వలన కొత్త సమస్యలు వస్తాయి. ఈ క్రమంలో విజయ్ ఆంటోనికి సంబందించిన కొన్ని నిజాలు బయట పడతాయి . ఆ నిజాలేంటి ? చివరకు ఏమి జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పేరు భద్రకాళి. ఇందులో హీరోగా నటించడంతో పాటు సంగీతం, నిర్మాణం కూడా విజయ్ ఆంటోనీదే. ఈ సినిమాను సెప్టెంబర్ 5 న థియేటర్ లో రిలీజ్ చేశారు. థియేటర్ లో ఈ సినిమా అంతంతమాత్రం టాక్ నే సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ఎంట్రీ ఇవ్వనుంది. అక్టోబరు 24 నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్స్టార్ లో తెలుగు ,, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినవారు ఓటిటిలో చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.