Swetha
ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా సెలెబ్రిటీలు అందరూ ఓటిటిలలో ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఇటు ప్రేక్షకులకు కూడా థియేటర్స్ వరకు వెళ్లే ఓపిక తగ్గిపోయింది. ఎదో బ్లాక్ బస్టర్ సినిమా అది కేవలం బిగ్ స్క్రీన్ మీదే ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే తప్ప.. థియేటర్స్ కు కదలడం లేదు. లేదంటే అంతా ఓటిటిల కోసమే ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా సెలెబ్రిటీలు అందరూ ఓటిటిలలో ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఇటు ప్రేక్షకులకు కూడా థియేటర్స్ వరకు వెళ్లే ఓపిక తగ్గిపోయింది. ఎదో బ్లాక్ బస్టర్ సినిమా అది కేవలం బిగ్ స్క్రీన్ మీదే ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే తప్ప.. థియేటర్స్ కు కదలడం లేదు. లేదంటే అంతా ఓటిటిల కోసమే ఎదురుచూస్తున్నారు. దీనితో కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటిటి రిలీజ్ నే లక్ష్యంగా పెట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రియాంక మోహన్ , ఆనంద్ దేవరకొండ ,సందీప్ కిషన్ నుంచి రానున్న మూవీలు కూడా నేరుగా ఓటిటి లోనే స్ట్రీమింగ్ కానుంది.
ప్రియాంక మోహన్ నుంచి రానున్న సినిమా ‘మెడ్ ఇన్ కొరియ’ . కొన్నేళ్ల నుంచి కొరియన్ డ్రామాస్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా అమ్మాయిలలో కొరియన్ డ్రామాస్ కు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. అలాంటి ఓ అమ్మాయి కొరియా వెళ్లిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది ఈ మూవీ కాన్సెప్ట్. ఇక ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా ‘తక్షకుడు’ . వేటగాడి చరిత్రలో జింకపిల్లలే నేరస్థులు అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమా రానుంది. మూవీ బ్యాక్డ్రాప్ అంతా కూడా యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది.
ఇక సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సిరీస్ ‘సూపర్ సుబ్బు’. ఓ టీచర్.. పల్లెటూరికి వెళ్లి స్కూల్లో పిల్లలకు సె*క్స్ ఎడ్యుకేషన్ నేర్పించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇవన్నీ కూడా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి. త్వరలోనే మూవీస్ స్ట్రీమింగ్ డేట్స్ ను అనౌన్స్ చేయనున్నారు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.