Swetha
రెగ్యులర్ గా కాకపోయినా.. మంచు లక్ష్మి అడపా దడపా సినిమాలు సిరీస్ లలో కనిపిస్తూనే ఉంటుంది. కానీ రీసెంట్ టైం లో మంచు లక్ష్మి నుంచి వచ్చిన సినిమాలు ఏమి లేవు. ఇక గత నెలలో ఓ తెలుగు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో మోహన్ బాబు కూడా స్పెషల్ రోల్ లో కనిపించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతుంది.
రెగ్యులర్ గా కాకపోయినా.. మంచు లక్ష్మి అడపా దడపా సినిమాలు సిరీస్ లలో కనిపిస్తూనే ఉంటుంది. కానీ రీసెంట్ టైం లో మంచు లక్ష్మి నుంచి వచ్చిన సినిమాలు ఏమి లేవు. ఇక గత నెలలో ఓ తెలుగు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో మోహన్ బాబు కూడా స్పెషల్ రోల్ లో కనిపించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతుంది.
Swetha
రెగ్యులర్ గా కాకపోయినా.. మంచు లక్ష్మి అడపా దడపా సినిమాలు సిరీస్ లలో కనిపిస్తూనే ఉంటుంది. కానీ రీసెంట్ టైం లో మంచు లక్ష్మి నుంచి వచ్చిన సినిమాలు ఏమి లేవు. ఇక గత నెలలో ఓ తెలుగు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో మోహన్ బాబు కూడా స్పెషల్ రోల్ లో కనిపించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.
ఈ సినిమా కథ విషయానికొస్తే… హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఊహించని విధంగా మరణిస్తాడు. ఆ కేసును లక్ష్మీ మంచు ఇన్వెస్టిగేట్ చేస్తుంది. తర్వాత వెంటనే అమెరికా నుంచి వచ్చిన ఓ ఫార్మా కంపెనీ ప్రతినిధి హత్యకు గురవుతాడు. ఈ కేసును కూడా మంచు లక్ష్మి టేకప్ చేస్తుంది. ఈ రెండు కేసుల్లో క్లూస్ ఒకేలా ఉంటాయి. ఇక మరోవైపు ఆమె మీద డాక్యుమెంటరీ చేయాలనీ లక్ష్మి మంచుని ఫాలో అవుతాడు ఓ వ్యక్తి. ఈ క్రమంలో ఆమె గురించి ఓ ఊహించని నిజం బయట పడుతుంది. ఆ నిజం ఏంటి ? ఆమె మీద డాక్యుమెంటరీ తీయాలని ఎందుకు అనుకుంటాడు ? ఆ హత్యలు చేసింది ఎవరు ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా పేరు ‘దక్ష’. ఈ సినిమా సెప్టెంబరు 19న థియేటర్లలోకి వచ్చింది. కానీ సినిమా వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియకుండా పోయింది. అయితే ఇలాంటి కొన్ని సినిమాలు ఓటిటి లోకి వచ్చిన తర్వాత బాగా ఫేమస్ అవుతూ ఉంటాయి. ఇక దక్ష ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి. ఈ సినిమా అక్టోబర్ 17 నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.