Swetha
ఈ మధ్య చిన్న సినిమా పెద్ద సినిమా అనే డిఫరెన్స్ ఏమి ఉండడం లేదు. వందల కోట్లు ఖర్చుపెట్టి , భారీ క్యాస్టింగ్ తో తీసిన సినిమా అయినా.. మీడియం , లో బడ్జెట్ తో తీసే సినిమా అయినా.. వాటి జాతకాలు రిలీజ్ తర్వాతే బయటపడుతున్నాయి. సో ఇక్కడ కేవలం కంటెంట్ మాత్రమే ముఖ్యం. అయితే ఏ సినిమాకైనా ఇప్పుడు ప్రమోషన్స్ చాలా కీలకం.
ఈ మధ్య చిన్న సినిమా పెద్ద సినిమా అనే డిఫరెన్స్ ఏమి ఉండడం లేదు. వందల కోట్లు ఖర్చుపెట్టి , భారీ క్యాస్టింగ్ తో తీసిన సినిమా అయినా.. మీడియం , లో బడ్జెట్ తో తీసే సినిమా అయినా.. వాటి జాతకాలు రిలీజ్ తర్వాతే బయటపడుతున్నాయి. సో ఇక్కడ కేవలం కంటెంట్ మాత్రమే ముఖ్యం. అయితే ఏ సినిమాకైనా ఇప్పుడు ప్రమోషన్స్ చాలా కీలకం.
Swetha
ఈ మధ్య చిన్న సినిమా పెద్ద సినిమా అనే డిఫరెన్స్ ఏమి ఉండడం లేదు. వందల కోట్లు ఖర్చుపెట్టి , భారీ క్యాస్టింగ్ తో తీసిన సినిమా అయినా.. మీడియం , లో బడ్జెట్ తో తీసే సినిమా అయినా.. వాటి జాతకాలు రిలీజ్ తర్వాతే బయటపడుతున్నాయి. సో ఇక్కడ కేవలం కంటెంట్ మాత్రమే ముఖ్యం. అయితే ఏ సినిమాకైనా ఇప్పుడు ప్రమోషన్స్ చాలా కీలకం. చిన్న సినిమాలకైతే మరింత ఇంపార్టెంట్. పైగా వీటికి సోషల్ మీడియా పబ్లిసిటీ యాడ్ అయితే.. అప్పుడు సినిమాకు వెళ్లేవారి కౌంట్ పెరుగుతుంది. దీనితో ఇప్పుడు ముందుజాగ్రత్తగా అసలు రిలీజ్ డేట్ కంటే ముందు రోజే ప్రీమియర్స్ బాట పడుతున్నాయి చిన్న సినిమాలు.
కంటెంట్ బావుంటే రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరుగుతుంది. లిటిల్ హార్ట్స్ విషయంలో ఇదే జరిగింది. ఇక ఇప్పుడు మిత్ర మండలి కూడా ముందు జాగ్రత్త పడుతుంది. ఈ ఏడాది దీపావళికి భారీ పోటీ జరగబోతుంది. రేస్ లో ఉన్న సినిమాలన్నీ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. సో ఈ కాంపిటీషన్ తట్టుకోవాలంటే కచ్చితంగా ఓ అడుగు ముందుకు వేయాల్సిందే. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో మిత్రమండలి టీం ప్రీమియర్స్ కు రెడీ అవుతుంది. అక్టోబర్ 16 న మెయిన్ రిలీజ్ డేట్.. ఇక ఇప్పుడు ముందు రోజు రాత్రి అంటే అక్టోబర్ 15 రాత్రి ప్రీమియర్స్ ను వేయనుంది.
ఈసారి కాంపిటీషన్ లో ఉన్న సినిమాలన్నీ కూడా యూత్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న సినిమాలే. కె ర్యాంప్ ఆల్రెడీ ప్రమోషన్స్ లో ఓ అడుగు ముందే ఉంది. ఇక డ్యూడ్ నుంచి వచ్చిన ట్రైలర్ లో ఓ చిన్న బైట్ సోషల్ మీడియాలో ఇప్పటికి హల్చల్ చేస్తూనే ఉంది. తెలుసుకదా కాస్త సైలెంట్ గా ఉంది కానీ తక్కువ అంచనా వేయలేము. కాంతారా చాప్టర్ 1 జోరు ఇంకా తగ్గలేదు. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మిత్రమండలి ముందుగానే జాగ్రత్తపడుతుందని అర్ధమౌతుంది. ఇక ఈ దీపావళి ధమాకా ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.