Swetha
పెద్ద పండగలు వస్తున్నాయంటే.. మూవీ లవర్స్ కు నిజంగా పండగలానే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి పెద్ద పండగలకు ఒకేసారి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక సంక్రాంతి రిలీజ్ లు ఎంత ఫేమస్ ఓ ఇప్పుడు దీపావళి రిలీజ్ లు కూడా అంతే ఫేమస్ అవుతున్నాయి. 2024 దీపావళికి వచ్చిన క , అమరన్, లక్కీ భాస్కర్ సినిమాలు గట్టిగానే సౌండ్ చేశాయి

పెద్ద పండగలు వస్తున్నాయంటే.. మూవీ లవర్స్ కు నిజంగా పండగలానే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి పెద్ద పండగలకు ఒకేసారి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక సంక్రాంతి రిలీజ్ లు ఎంత ఫేమస్ ఓ ఇప్పుడు దీపావళి రిలీజ్ లు కూడా అంతే ఫేమస్ అవుతున్నాయి. 2024 దీపావళికి వచ్చిన క , అమరన్, లక్కీ భాస్కర్ సినిమాలు గట్టిగానే సౌండ్ చేశాయి. ఇక ఇప్పడు ఈసారి రేస్ లో మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.
వాటిలో మూడు సినిమాలు యూత్ ను టార్గెట్ చేస్తూనే వస్తున్నాయి. కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ , డ్యూడ్ , తెలుసు కదా సినిమాలకు జెన్ జెడ్ వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారని టీం స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. ఇక జాతిరత్నాలు టైప్ లో మిత్రమండలి ఉండబోతుందని టాక్. ఈ సినిమాను రిలీజ్ కంటే ఓ రోజు ముందే ప్రీమియర్స్ రూపంలో రానుంది. ప్రీమియర్స్ లో కనుక పాజిటివ్ టాక్ వస్తే ఇక సినిమాకు తిరుగుండదు. సోషల్ మీడియా ప్రమోషన్స్ ఈ మూడు సినిమాలకు ప్లస్ పాయింట్స్ అవుతాయి.
ఇక ఇప్పటికే కాంతారా చాప్టర్ 1 థియేటర్స్ ను రూల్ చేస్తూ ఉంది. ఈ సినిమా జోరు ఇంకా తగ్గలేదు. సో ఈసారి దీపావళి మొత్తం ఐదు సినిమాల సందడి ఉండబోతుంది. ఇప్పటివరకు ఆయా సినిమాల నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా ప్రామిసింగ్ గానే ఉంది. సో మరోసారి 2024 దీపావళి మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.