Swetha
ఓ సినిమాకు అనౌన్సుమెంట్ స్టేజ్ నుంచే బజ్ క్రియేట్ అయిందంటే కచ్చితంగా దానివెనుక రాజమౌళి ఉన్నట్లే. ఎందుకంటే ఇండస్ట్రీలో రాజమౌళి సెట్ చేసిన మార్క్ అలాంటిది. బాహుబలితో టాలీవుడ్ రేంజ్ మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే బాహుబలి సినిమాను ప్రేక్షకులంతా కొన్ని వందల సార్లు చూసి ఉంటారు.
ఓ సినిమాకు అనౌన్సుమెంట్ స్టేజ్ నుంచే బజ్ క్రియేట్ అయిందంటే కచ్చితంగా దానివెనుక రాజమౌళి ఉన్నట్లే. ఎందుకంటే ఇండస్ట్రీలో రాజమౌళి సెట్ చేసిన మార్క్ అలాంటిది. బాహుబలితో టాలీవుడ్ రేంజ్ మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే బాహుబలి సినిమాను ప్రేక్షకులంతా కొన్ని వందల సార్లు చూసి ఉంటారు.
Swetha
ఓ సినిమాకు అనౌన్సుమెంట్ స్టేజ్ నుంచే బజ్ క్రియేట్ అయిందంటే కచ్చితంగా దానివెనుక రాజమౌళి ఉన్నట్లే. ఎందుకంటే ఇండస్ట్రీలో రాజమౌళి సెట్ చేసిన మార్క్ అలాంటిది. బాహుబలితో టాలీవుడ్ రేంజ్ మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే బాహుబలి సినిమాను ప్రేక్షకులంతా కొన్ని వందల సార్లు చూసి ఉంటారు. అయినా సరే ఇప్పుడు బాహుబలి రెండు పార్ట్శ్ కలిపి రీరిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసినప్పటినుంచి.. దీని మీద కూడా అంతే బజ్ నెలకొంది. అక్టోబర్ 31న ఈ సినిమా రీరిలీజ్ కానుంది.
టికెట్ ధరలు కూడా అందుబాటులోనే ఉండబోతున్నాయట. అయితే ఇప్పుడు ఈ రీరిలీజ్ మరో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేయబోతుంది. చూసిన సినిమా ఏమి చూస్తాములే అనే ఫీలింగ్ లేకుండా ఆడియన్స్ రీరిలీజ్ లను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రీరిలీజ్ ల హడావిడి రెండు మూడు రోజుల వరకు ఉంటుంది. ఇక్కడి వరకు అన్ని రీరిలీజ్ లకు జరిగేదే. కానీ బాహుబలి ఎపిక్ రిలీజ్ కు మాత్రం ప్రీమియర్స్ ను కూడా సిద్ధం చేస్తున్నారట. సాధారణంగా ఈ ప్రీమియర్స్ కొత్త సినిమాలకు వేస్తూ ఉంటారు. ఈ దీపావళి రిలీజ్ ల లో మిత్రమండలి ముందు జాగ్రత్తగా పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు.
ఇక ఇప్పుడు బాహుబలి ఎపిక్ కు కూడా రెండు రోజుల ముందు నుంచే ప్రీమియర్స్ వేస్తున్నారట. . రీ రిలీజ్‌ల్లో ‘ది ఎపిక్’ ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అంతా స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. పైగా ఇందులో కొన్ని సర్ప్రైజ్ లు కూడా ఉన్నాయట. తెలుగులో, హిందీలో సెలబ్రెటీ ప్రిమియర్స్ కూడా వేస్తారట. వీటికి మూవీ మెయిన్ టీం అటెండ్ అయ్యే అవకాశం ఉందట. ఐకే ఈ రీరిలీజ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.