iDreamPost
android-app
ios-app

తెలుసుకదా లో తెలియని కోణం

  • Published Oct 14, 2025 | 10:58 AM Updated Updated Oct 14, 2025 | 10:58 AM

సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా సినిమా ఈ దీపావళి రిలీజ్ కానుంది. ఈ సినిమాతో సిద్ధూ మళ్ళీ ఫార్మ్ లోకి వస్తాడని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు నీరజ కోన డైరెక్టర్. లేడి డైరెక్టర్ కాబట్టి ఓ సాఫ్ట్ లవ్ స్టోరీ ఉంటుందని అంతా అనుకున్నారు. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మధ్య లవ్ స్టోరీలు గతంలోనే అంతా చూసేసారు. సో ఇది కూడా దాదాపు అలానే ఉంటుందని అనుకున్నారు.

సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా సినిమా ఈ దీపావళి రిలీజ్ కానుంది. ఈ సినిమాతో సిద్ధూ మళ్ళీ ఫార్మ్ లోకి వస్తాడని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు నీరజ కోన డైరెక్టర్. లేడి డైరెక్టర్ కాబట్టి ఓ సాఫ్ట్ లవ్ స్టోరీ ఉంటుందని అంతా అనుకున్నారు. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మధ్య లవ్ స్టోరీలు గతంలోనే అంతా చూసేసారు. సో ఇది కూడా దాదాపు అలానే ఉంటుందని అనుకున్నారు.

  • Published Oct 14, 2025 | 10:58 AMUpdated Oct 14, 2025 | 10:58 AM
తెలుసుకదా లో తెలియని కోణం

సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా సినిమా ఈ దీపావళి రిలీజ్ కానుంది. ఈ సినిమాతో సిద్ధూ మళ్ళీ ఫార్మ్ లోకి వస్తాడని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు నీరజ కోన డైరెక్టర్. లేడి డైరెక్టర్ కాబట్టి ఓ సాఫ్ట్ లవ్ స్టోరీ ఉంటుందని అంతా అనుకున్నారు. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మధ్య లవ్ స్టోరీలు గతంలోనే అంతా చూసేసారు. సో ఇది కూడా దాదాపు అలానే ఉంటుందని అనుకున్నారు. పైగా టీజర్ వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ లో కూడా సిద్దు మార్క్ ఏమి కనిపించలేదు. ఇక మూవీ ప్రమోషన్స్ లో కూడా సైలెంట్ గానే ఉన్నారు ఈ టీం. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఒకేసారి ఆడియన్స్ పోయింట్ ఆఫ్ వ్యూ మారిపోయింది.

ఏకంగా అర్జున్ రెడ్డి తరహాలో సిద్ధూ జొన్నలగడ్డ షాక్ ఇచ్చాడు. సో ఇది కచ్చితంగా రొటీన్ సినిమా కాదని ఓ న్యూ ఏజ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని కచ్చితంగా అర్థమైపోయింది. జనరల్ గా బాలీవడ్ లవ్ స్టోరీలు రొటీన్ కి బిన్నంగా ఉంటాయి. అవి ఇక్కడ ప్రేక్షకులకు మరీ అంతగా నప్పవు. కానీ నీరజ కోన ఇప్పుడు ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేయబోతున్నారు. జెన్ జెడ్ కంటే జెన్ ఆల్ఫా యూత్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఓ రకంగా నీరజ కోన రిస్క్ చేస్తున్నట్లే అనిపిస్తుంది. మూవీ ప్రమోషన్స్ లో జోరు చూపించకపోయినా.. సైలెంట్ కిల్లర్ లా సినిమా రాబోతుందని టాక్.

దీనితో ఇప్పుడు సోషల్ మీడియాలో దీని గురించి చాలా రకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. మూవీలో అసలు ఏమి చూపించబోతున్నారు, ఎలాంటి తరహా కంటెంట్ ఉండబోతుంది అనేది సస్పెన్స్. ఇలాంటి ఎన్ని టాక్స్ వచ్చినా.. ఒకవేళ ఈ కంటెంట్ కనుక జనాలకు నచ్చితే కచ్చితంగా ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ అవుతుందని ఇన్సైడ్ టాక్. లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తుందని తెలుసు కదాని తక్కువ అంచనా వేయడానికి లేదు. తెలుసు కదాలో ఎదో తెలియని కోణం అయితే ఉందని తెలుస్తుంది. అదేంటో తెలియాలంటే అక్టోబర్ 17న చూడాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.