iDreamPost
android-app
ios-app

దృశ్యం డైరెక్టర్ నుంచి OTT లో న్యూ మూవీ

  • Published Oct 14, 2025 | 3:41 PM Updated Updated Oct 14, 2025 | 3:41 PM

దృశ్యం సినిమా అందరికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో తెలియనిది కాదు. ఈ సినిమా పేరు వినగానే అందరికి గుర్తొచ్చేది జీతూ జోసెఫ్ ఏ. థ్రిల్లర్ సినిమాలను తీయడంలో ఈ దర్శకుడికి మించిన వారు ఎవరు ఉండరు. ఆల్రెడీ దృశ్యం నుంచి రెండు పార్ట్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు మూడో పార్ట్ ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు.

దృశ్యం సినిమా అందరికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో తెలియనిది కాదు. ఈ సినిమా పేరు వినగానే అందరికి గుర్తొచ్చేది జీతూ జోసెఫ్ ఏ. థ్రిల్లర్ సినిమాలను తీయడంలో ఈ దర్శకుడికి మించిన వారు ఎవరు ఉండరు. ఆల్రెడీ దృశ్యం నుంచి రెండు పార్ట్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు మూడో పార్ట్ ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు.

  • Published Oct 14, 2025 | 3:41 PMUpdated Oct 14, 2025 | 3:41 PM
దృశ్యం డైరెక్టర్ నుంచి OTT లో న్యూ మూవీ

దృశ్యం సినిమా అందరికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో తెలియనిది కాదు. ఈ సినిమా పేరు వినగానే అందరికి గుర్తొచ్చేది జీతూ జోసెఫ్ ఏ. థ్రిల్లర్ సినిమాలను తీయడంలో ఈ దర్శకుడికి మించిన వారు ఎవరు ఉండరు. ఆల్రెడీ దృశ్యం నుంచి రెండు పార్ట్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు మూడో పార్ట్ ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అయితే ఇప్పుడు జీతూ జోసెఫ్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయింది.

ఈ సినిమా ఏంటో తెలుసుకునే ముందు మూవీ స్టోరీ ఏంటో చూసేద్దాం. ఈ స్టోరీ లైన్ విషయానికొస్తే..ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న కిరణ్ పై సడెన్ గా అభిరామి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది. అదే సమయంలో కిరణ్ ఓ ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడని తెలుస్తుంది. ఈ షాక్ నుంచి బయటపడేలోపే పోలీస్ లు అభిరామిని ఓ హార్డ్ డిస్క్ గురించి ప్రశ్నించడం మొదలుపెడతారు. అసలు ఆ హార్డ్ డిస్క్ లో ఏముంది ? కిరణ్ కి ఏమైంది ? అభిరామి ఎందుకు కళ్యాణ్ మీద కంప్లైంట్ ఇద్దామని అనుకుంది ? చివరికి ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పేరు మిరాజ్. సెప్టెంబర్ 19న ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్ ఆడియన్స్ నుంచి ఈ మూవీ యావరేజ్ టాక్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు అక్టోబర్ 20 నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ సోని లివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.