Swetha
ఓటిటిలు సినిమా రిలీజ్ డేట్ లను శాసిస్తున్నయని ఎప్పటినుంచో వినిపిస్తున్న టాక్. ఓ సినిమా రిలీజ్ కు ముందు ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ భారీ ధరలకు డీల్ మాట్లాడుకోవడం.. ఓటిటి స్ట్రీమింగ్ డేట్స్ లాక్ చేసుకోవడం జరుగుతుంది. అయితే చాలా వరకు సినిమాలన్నీ కూడా థియేటర్ లో రిలీజ్ అయిన 28 రోజులకే ఓటిటిలో దర్శనమిస్తున్నాయి.
ఓటిటిలు సినిమా రిలీజ్ డేట్ లను శాసిస్తున్నయని ఎప్పటినుంచో వినిపిస్తున్న టాక్. ఓ సినిమా రిలీజ్ కు ముందు ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ భారీ ధరలకు డీల్ మాట్లాడుకోవడం.. ఓటిటి స్ట్రీమింగ్ డేట్స్ లాక్ చేసుకోవడం జరుగుతుంది. అయితే చాలా వరకు సినిమాలన్నీ కూడా థియేటర్ లో రిలీజ్ అయిన 28 రోజులకే ఓటిటిలో దర్శనమిస్తున్నాయి.
Swetha
ఓటిటిలు సినిమా రిలీజ్ డేట్ లను శాసిస్తున్నయని ఎప్పటినుంచో వినిపిస్తున్న టాక్. ఓ సినిమా రిలీజ్ కు ముందు ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ భారీ ధరలకు డీల్ మాట్లాడుకోవడం.. ఓటిటి స్ట్రీమింగ్ డేట్స్ లాక్ చేసుకోవడం జరుగుతుంది. అయితే చాలా వరకు సినిమాలన్నీ కూడా థియేటర్ లో రిలీజ్ అయిన 28 రోజులకే ఓటిటిలో దర్శనమిస్తున్నాయి. దీనితో థియేటర్ రెవెన్యూ పడిపోతుంది. ఇవన్నీ చేంజ్ అవ్వాలంటే నిర్మాతలు కచ్చితంగా కొన్ని రూల్స్ పాటించాల్సిందే. థియేటర్ కు ఓటిటి కి మధ్య కనీసం ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నదే.
బాలీవుడ్ నిర్మాతలు , మలయాళం నిర్మాతలు అంతా ఈ కండిషన్ ను ఖరాఖండీగా ఫాలో అవుతున్నారు. కానీ తెలుగు తమిళం ప్రొడ్యూసర్స్ మాత్రం దీనిని సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. 28 రోజులకు సై అంటున్నారు. కానీ తాజాగా ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ సినిమా విషయంలో మాత్రం ఎనిమిది వారాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ డ్రాగన్ సినిమా హక్కులను మంచి ధరకు కొనుగోలు చేసిందంట. అలాగే సినిమాను ఎనిమిది వారాల తర్వాత మాత్రమే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేసేలా డీల్ మాట్లాడుకున్నారట.
దీనితో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎందుకంటే ఇలాంటి ఒప్పందం వలన థియేటర్ లో ఎక్కువరోజులు సినిమా ఆడే అవకాశం ఉంటుంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనీసం నలభై రోజులు ఆక్యుపెన్సీలు ఎక్కువగా ఉంటాయి. పెద్ద పెద్ద సినిమాలన్నీ ఇలాంటి రూల్స్ ఫాలో అవుతున్నాయి. పుష్ప 2 ది రూల్, కల్కి 2898 ఏడి లాంటివి ఈ స్ట్రాటజీనే ఫాలో అయ్యి మంచి సక్సెస్ అందుకున్నాయి. సో మరీ అన్ని సినిమాలు కాకపోయినా కనీసం పాన్ ఇండియా సినిమాలైనా ఇలాంటి రూల్స్ ని పాటిస్తే.. థియేటర్స్ కు నష్టం వాటిల్లకుండా ఉంటుందని టాక్. ఇక ముందు ముందు నిర్మాతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.