ప్రముఖ కవి, జానపద కళాకారుడు, ప్రజా గాయకుడు గోరేటి వెంకన్నను తెలంగాణ సీఎం కేసీఆర్ శాసన మండలి సభ్యునిగా ఎంపిక చేశారు. గవర్నర్ కోటాలో గోరేటి వెంకన్నను శాసన మండలికి పంపించాలని నిర్ణయించారు. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గోరేటి వెంకన్న తన గళాన్ని వినిపించారు. తెలంగాణ యాస, భాషలతో పాటలు పాడుతూ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. ఈ నేపథ్యంలోనే గోరేటి వెంకన్నను శాసన మండలికి […]