యువకుడు, సమస్యలు అర్ధం చేసుకుని పరిష్కరించే చురుకుదనం, విద్యావంతుడు, నియోజవర్గంలో తిరుగులేని ఆధిక్యం ప్రదర్శిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. అయితే ఆయన వర్గీయుల్లో మాత్రం జగ్గిరెడ్డికి తగినంత ప్రాధాన్యం లభించడం లేదన్న అసంతృప్తి మాత్రం నెలకొంది. తండ్రి, తాతల నుంచి రాజకీయ వారసత్వాన్ని పొందిన జగ్గిరెడ్డి కొత్తపేట నియోజకవర్గం ప్రజల్లో తిరుగులేని పట్టును సంపాదించుకున్నారు. తండ్రి సోమసుందరెడ్డి వృద్ధాప్యం కారణంగా 2004లో ఎమ్మెల్యే సీటు పొందిన జగ్గిరెడ్డి దివంగత నేత వైఎస్ […]