ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంటర్ పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పిల్లల ప్రాణాల మీద, వారి భవిష్యత్తు మీద మమకారం, బాధ్యత ఉన్న ప్రభుత్వంగా సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని అనుకున్నామని.. […]
కరోనా తాకిడి పెరుగుతున్న తరుణంలో కేంద్రం సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా వేసింది. సీబీఎస్ బోర్డు ఈ మేరకు ప్రకటన చేస్తూ పదో తరగతి పరీక్షలు పూర్తిగా రద్దు చేసి, 12వ తరగతి పరీక్షలు మాత్రం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అదే సమయంలో ఏపీలో మాత్రం ఎస్సెస్సీ పరీక్షలు యధావిధిగా జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఎటువంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని కొన్ని […]