రాబోయే రోజుల్లో థియేటర్ డెఫినిషన్ మారబోతోంది. అందరికీ వెండితెర వినోదాన్ని అందించాలనే సంకల్పంతో ఇటు ప్రభుత్వాలు అటు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఔత్సాహికులతో త్వరలోనే దేశవ్యాప్తంగా వందా వెయ్యి కాదు ఏకంగా లక్ష స్క్రీన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. అన్నీ అనుకున్నట్టు ప్లాన్ ప్రకారం జరిగితే ఐదేళ్లలోనే ఇది సాధ్యమవొచ్చు. అయితే ఇది పట్టణాలు నగరాలకు తీసుకొస్తున్న స్కీం కాదు. పక్కా పల్లెటూళ్ళను లక్ష్యంగా చేసుకుని సిఎస్సి ఈ గవర్నెన్స్ ఈ విప్లవానికి శ్రీకారం చుట్టబోతోంది. 2023 […]