స్టడీ సర్టిఫికెట్ కోసం, నేను చదువుకున్న ప్రైమరీ స్కూల్ కి సుమారు 22 ఏళ్ల తర్వాత వెళ్లాల్సి వచ్చింది. దాదాపుగా స్కూల్ మొత్తం మారిపోయింది. స్కూల్ దగ్గరకు వెళ్లి స్కూటీ పార్క్ చేసి స్కూల్ లోపలి వెళ్ళాను. టీచర్ పాఠం చెప్తూ నన్ను చూసి ఏం కావాలండీ అని అడిగింది. స్టడీ సర్టిఫికెట్ కోసం వచ్చాను మేడం అని చెప్పాను. కాసేపు బయట ఉండండి, కంప్లీట్ చేయాల్సిన సిలబస్ చాలా ఉంది. ఒక అరగంట తర్వాత రండి అని మేడం […]