విషయం లేకుండా కేవలం హంగులతో గ్రాఫిక్స్ తో సినిమాలు ఆడతాయా అంటే చిన్నపిల్లాడిని అడిగినా నో అనే చెబుతాడు. బాహుబలిలో ఎంత గొప్ప విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నా ఎమోషన్ లేకుండా ఆ గ్రాండియర్ ని ఊహించుకోగలమా. అసాధ్యం కదా. కట్టిపడేసే కథాకథనాలే దాన్ని ఇంకో స్థాయిలో నిలబెట్టాయి. వాటిని పట్టించుకోకుండా చేతిలో వనరులు ఉన్నాయి కదాని స్టార్ హీరోతో సినిమా తీస్తే బోల్తా కొట్టడం ఖాయం. అదెలాగో చూద్దాం. 1999 సంవత్సరం. ఈనాడు అధినేత రామోజీరావు గారు […]