కొన్ని సినిమా కాంబినేషన్లు చాలా అరుదుగా అద్భుతంగా అనిపిస్తాయి. ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తిని రేపుతాయి. అందులోనూ పేరున్న దర్శకుడు దానికి తోడైతే ఇక ఆకాశం హద్దు అనే మాట కూడా చిన్నదే. 1993లో వచ్చిన మెకానిక్ అల్లుడు దీనికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి ఫస్ట్ టైం కాంబోలో మాస్ చిత్రాల దర్శకుడు బి గోపాల్ డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మొదటిసారి దీన్ని అనౌన్స్ చేసినప్పుడు ఇద్దరు హీరోల అభిమానులు […]