జనసేన అధినేతకు కొత్త సమస్యలు వస్తున్నాయి. ఆయనకు చేరువయిన నేతలంతా ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ముఖ్యంగా సొంత కులంలో గుర్తింపు ఉన్న వారే పవన్ ని భరించలేమంటూ రాజీనామాలు ఇచ్చి పోతున్నారు. కాపుల ఓట్లే ఆధారంగా భావించిన పవన్ కళ్యాణ్ కి భవిష్యత్తులో కష్టాలు తప్పవా అనే సందేహానికి ఈ పరిణామాలు దోహదపడుతున్నాయి. సొంత కులస్తులే అంతో ఇంతో అండగా ఉంటున్న తరుణంలో వారిలో విద్యావంతులు, మేథావులుగా గుర్తింపు ఉన్న వారు కూడా జారిపోతే జనసేన రెంటికీ చెడ్డ […]