ధారాళంగా ఎన్నికల హామీలు ఇవ్వడం సమంజసం కాదు. ఆచరణ సాధ్యమైన హామీలే ఇవ్వాలి. ఇచ్చిన వాగ్దానాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజకీయ పార్టీలకు సూచించారు. రెండు రోజులుగా ఏపీలో పర్యటిస్తున్న ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇటీవలి కాలంలో ఎన్నికల హామీలు గుప్పించడంలో పార్టీలు పోటీపడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవో కొన్నింటిని అమలుచేసి.. మిగతావాటిని విస్మరిస్తున్నాయి. ఈ ధోరణి పట్ల వెంకయ్య ఆవేదన సమంజసమే. కానీ ఇక్కడ గమనించాల్సిన […]
“మనది ప్రజాస్వామ్యం. ప్రజలు ఓట్లేసి గెలిపించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం, ప్రజాతీర్పు పట్ల గౌరవం రాజకీయ పార్టీలకే కాదు, చట్టసభల సభ్యులకు ఉండాలి. మన సభ (రాజ్యసభ) పెద్దల సభ. విజ్ఞులైన ఈ సభ సభ్యులు ప్రజాతీర్పు ఎలా వచ్చిందో, ఏ ప్రభుత్వం పరిపాలనను ప్రజలు కోరుకుంటున్నారో తెలుసుకుని, ఆ ప్రజా తీర్పును గౌరవించేలా మనం స్పందించాలి. ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా మన […]