లాక్డౌన్ 4.0 ముగిసిన తరువాత కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకే అధికారం ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 1 నుంచి కరోనా కేసులు, విస్తృతిని దృష్టిలో పెట్టుకుని కంటెయిన్మెంట్ జోన్లు, ఇతర ఆంక్షలు, సడలింపుల విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే, దాదాపు 80% పాజిటివ్ కేసులు ఉన్న 30 మున్సిపల్ ప్రాంతాల్లో కఠినంగా ఆంక్షలను అమలు చేయాలని ఆయా రాష్ట్రాలకు సూచించే […]
తాజాగా భారత్లో కరోనా కేసుల సంఖ్య లక్షన్నరకు చేరుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మే 31 తర్వాత మరో రెండు వారాల వరకు లాక్ డౌన్ను పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి. మరో ఐదు రోజులలో మే 31 న లాక్ డౌన్ 4 .0 ముగుస్తుంది.లాక్ డౌన్ 4.0 లో కొన్ని సడలింపులు ఇచ్చిన కేంద్రం ఈసారి లాక్ డౌన్ 5.0 లో మరింత ఎక్కువగా సడలింపులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ […]