ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉల్లంఘించారు. ఏకపక్షంగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటికే ఏపీ హైకోర్ట్ ఆదేశాలున్నప్పటికీ ఆయన ఖాతరు చేసినట్టు కనిపించడం లేదు. ప్రభుత్వంతో చర్చించి, సామరస్య పూర్వకంగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దానికి అనుగుణంగా సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ తో పాటుగా వైద్య ఆరోగ్య, గ్రామీణాభివృద్ద శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎస్ ఈ సీతో మంతనాలు జరిపారు. ప్రభుత్వ వైఖరిని […]
ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నిర్వహించిన సమావేశంలో ఆయా రాజకీయ పార్టీలు అభిప్రాయాలు అందరూ ఊహించిన విధంగానే ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన 18 జాతీయ, ప్రాంతీయ పార్టీలకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆహ్వానం పంపారు. ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే హైకోర్టులో తన అభిప్రాయాన్ని అఫిడవిట్ రూపంలో చెప్పిన అధికార పార్టీ వైసీపీ.. ఈ సమావేశాన్ని బాయ్‌కాట్ చేసింది. వైసీపీ మినహా […]