లైగర్ పంచాయితీ వ్యవహారం పోలీసుల దాకా వెళ్ళాక దర్శకుడు పూరి జగన్నాధ్ కు సెక్యూరిటీని జారీ చేస్తూ ఉత్తర్వులు వచ్చేశాయి. తనను డిస్ట్రిబ్యూటర్లు ఫైనాన్సియర్లు బెదిరిస్తున్నారని ఆ కారణంగా భద్రత కల్పించాలని పూరి విన్నవించుకున్న ఇరవై నాలుగు గంటల్లోనే స్పందన రావడం గమనార్హం. మరోవైపు ఫిర్యాదులో అభియోగం మోపబడ్డ శోభన్ తాను గతంలో పూరికి ఎంతో సహాయం చేశానని, లైగర్ రిలీజైన రెండో రోజు నుంచే కాల్స్ లిఫ్ట్ చేయడం ఆపేయడం ఎంతవరకు న్యాయమని కొన్ని విషయాలు […]