ఎవరికీ అక్కరకు కాని విధంగా మొదలైంది మునుగోడు ఉప ఎన్నిక. నెలరోజుల తరబడి వేలకొద్దీ కార్ల హారన్ మోతలతో ఆ ప్రాంతం ఎన్నడూ చూడని ఆసక్తిని రేకెత్తింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయ చిత్రపఠంలో మునుగోడు ఎరుగని ప్రాముఖ్యతని సంతరించుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మరో ప్రతిపక్షమైన బిజేపి నుంచి పోటీ చేస్తానంటూ దిగిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి గారు ఊహించని విధంగా, జీవితంలో ఎప్పుడు తెలియని విధంగా శ్రమించి పోరాడాల్సి వచ్చింది. కాంగ్రెస్ సీటే కదా […]