కూచిపూడి-ఆంధ్రప్రదేశ్.. ఈ రెండిటినీ వేరుగా చూడలేము.. భారత సాంప్రదాయ 11 నృత్యాలలో కూచిపూడి ఒకటి.ఈ నృత్యం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామంలో పుట్టిందని అంటారు.17 వ శతాబ్ధం లో నారాయణ తీర్ధులు కూచిపూడికి మరింత జీవం పోశారని చెబుతారు.నారాయణ తీర్ధుల కృష్ణ లీల తరంగాలు, రుక్మిణీ, రామయ్య శాస్త్రి భామా కలాపం,గొల్ల కలాపం ప్రసిద్ధి కెక్కాయి.పేర్నీ తాండవం చూస్తే రెండు కళ్ళు చాలవు.