ఆ పల్లెల్లో ప్రతి ఇంటికీ రెండు రేషన్ కార్డులు ఉంటాయి. ప్రతి వ్యక్తికి రెండు ఆధార్ కార్డులు ఉంటాయి. రెండు ఓటర్ కార్డులు ఉంటాయి. అలాగని ఇవేవో నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్నవి కావు. పూర్తి న్యాయబధ్ధంగా అధికారులు జారీ చేసినవే. కాకపోతే రెండు రాష్ట్రాల తరపున జారీ చేసినవి కావడమే విశేషం. ఎందుకంటే ఆ పల్లెల్లో రెండు ప్రభుత్వాల పాలన సాగుతోంది. ఇటు ఆంధ్ర.. అటు ఒడిశా రాష్ట్రాలు తమవిగా చెప్పుకొంటున్న ఆ గ్రామాలు కొఠియా పల్లెలు. […]