ఆయన ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. సీనియర్ రాజకీయ నాయకుడు. పలుమార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అలాంటి వ్యక్తికి తన సొంత ప్రాంతంలో దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మొన్నటికి మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఒక ఎత్తయితే.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పరువు పోగొట్టుకున్నారు. తన సొంత మండలంలో కనీసం పోటీకి అభ్యర్థులు నిలబెట్టలేక చతికిలబడ్డారు. ఆయనెవరో కాదు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం ప్రభావం […]