భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర తెలపడంతో అత్యున్నత పదవికి రెండో తెలుగు వ్యక్తి ఎంపికైనట్లు అయింది. జస్టిస్ ఎన్.వి.రమణ ముందు ఆ పదవిని అధిరోహించిన తెలుగు వ్యక్తి కోకా సుబ్బారావు. 1966 – 67 సంవత్సరం లోనే ఆయన మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు సీజేఐ గా బాధ్యతలు నిర్వర్తించారు. గోదావరి వాసి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కి చెందిన వారు కోకా సుబ్బారావు. 1902 పుట్టిన ఆయన కుటుంబమంతా […]