ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ పురస్కారంతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ నామినేషన్ దక్కించుకుని తెలుగువాడి విజయపతాకాన్ని అంతర్జాతీయ వీధుల్లో ఎగరేసిన సంగీత దర్శకులు ఎంఎం కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడం టాలీవుడ్ నే కాదు యావత్ సినీ ప్రేక్షకులను సంతోషంలో ముంచెత్తుతోంది. కేవలం రోజుల వ్యవధిలో ఇన్నేసి శుభవార్తలు వినాల్సి రావడం కుటుంబానికే కాదు ఫ్యాన్స్ ని అంతులేని ఆనందాన్ని కలిగిస్తోంది. లేట్ ఏజ్ లోనూ ఇంత గొప్ప ఖ్యాతిని అందుకుంటున్న […]
కరోనా లాక్ డౌన్ ప్రభావమో లేక ఇంకే కారణమో చెప్పలేం కానీ మొత్తానికి ఈ మూడు నెలల కాలం టాలీవుడ్ ని విపరీతమైన పరిణామాలకు గురి చేస్తోంది. స్క్రిప్ట్ లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విదేశీ షెడ్యూల్స్ కి బదులు ఇక్కడే ఫిలిం సిటీలోనో లేక స్టూడియోలోనో బాలన్స్ షూటింగులను పూర్తి చేసుకునేలా పలువురు ప్లానింగ్ లో ఉన్నారు. ఇప్పుడు దీని ప్రభావం పవన్ 27 మీద కూడా పడినట్టు ఉంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ […]
కొన్ని సార్లు చాలా ఆసక్తి రేపిన సినిమాలు, కాంబినేషన్లు తెరకెక్కకుండానే ఆగిపోవడం అభిమానులను కలవరానికి గురి చేస్తుంది. స్వర్గీయ ఎన్టీఆర్ తో మొదలుకుని ఇప్పటి రామ్, రాజ్ తరుణ్ లాంటి చిన్న హీరోల దాకా ఇలాంటివి ఎన్నో జరిగాయి . కాని ఇది జరిగి ఉంటే బాగుండేది అనిపించేలా ఉన్నా అవి ప్రకటన దశకే పరిమితమవుతాయి. ఇది అలాంటిదే. 1993లో నరేష్ హీరోగా ‘అధికారం’ అనే టైటిల్ తో నరేష్ తానూ నిర్మాతల్లో ఒక భాగంగా పొలిటికల్ […]
రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రస్తుతం కరోనా వల్ల ఆగిపోయినా మరోవైపు వర్క్ ఫ్రొం హోం తరహలో కీరవాణి తదితరులు దీనికి సంబంధించిన కీలక వ్యవహారాల్లో బిజీగానే ఉన్నారట. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ లో అసలు ఎన్ని పాటలు ఉంటాయనే అనుమానం ప్రేక్షకుల్లో ఎప్పటి నుంచో ఉంది. లీకైన తాజా డేట్ ప్రకారం ఇందులో చిన్నవి పెద్దవి అన్ని కలిపి 10 ట్రాక్స్ ఉంటాయని తెలిసింది. […]
తెలుగు సినిమాను మాస్ ఆడియన్స్ పరంగా విపరీతంగా ప్రభావితం చేసిన దర్శకుల్లో కె రాఘవేంద్రరావు గారిది ప్రత్యేక స్థానం. అడవి రాముడుతో మొదలుకుని ఘరానా మొగుడు దాకా ఇండస్ట్రీ రికార్డులు సాధించిన ఆణిముత్యాలు ఎన్నో. అందుకే వంద సినిమాల ప్రస్థానంలో ఈయన అందుకున్న పరాజయాలు తక్కువే. కాని ఒక్కోసారి లెక్కలు మారి అంచనాలు మితిమీరి దెబ్బ తినడం ఇలాంటి తలపండిన దర్శకేంద్రులకు కూడా జరుగుతుంది. 1996లో అలాంటి అనుభవమే ఎదురయ్యింది. వెంకటేష్ హీరోగా బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మాణంలో […]
తెలుగు సినిమా ప్రస్థానంలో వర్మ పేరుకో ప్రత్యేకమైన పేజీ ఉంది. ఇప్పుడెలాంటివి తీస్తున్నాడన్నది పక్కన పెడితే శివతో ఓ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది మాత్రం వర్మనే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 1989లో శివ రిలీజైనప్పుడు ఎవరీ కుర్రాడని ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంది. తమకూ అలాంటి సినిమా తీసిపెట్టామని బ్లాంక్ చెక్కులతో నిర్మాతలు క్యూలు కట్టారు. కానీ శివ హిందీ రీమేక్ తర్వాత కొంత టైం తీసుకున్న వర్మ వెంకటేష్-శ్రీదేవి ఫస్ట్ టైం కాంబినేషన్ […]
సంగీత దర్శకుడి నుంచి అవుట్ ఫుట్ రాబట్టుకోవడం అనేది డైరెక్టర్ చేతిలో ఉంటుందన్నది వాస్తవం. అందులోనూ స్టార్లతో డీల్ చేసే దర్శకేంద్రులు రాఘవేంద్రరావు లాంటి వాళ్లకు ఇది చాలా కీలకం.అభిరుచిలో ఏ మాత్రం తేడా ఉన్నా దాని ప్రభావం నేరుగా ఫలితం మీద ఉంటుంది. అందుకే అడవి రాముడు లాంటి అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ లోనూ కోటి రూపాయల పాటను పుట్టించగలిగారు రాఘవేంద్రులు. 90వ దశకంలో ఎప్పుడైతే ఎంఎం కీరవాణితో ఈయన జట్టు […]
దేవిశ్రీ ప్రసాద్, కీరవాణి ఈ రెండు సినిమా ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేర్లు. తమదైన శైలిలో ఒక బ్రాండ్ ని ఏర్పరుచుకుని ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ని ఎన్నో ఇచ్చారు ఈ ఇద్దరూ. కీరవాణి 90వ దశకంనుంచే తన ప్రస్థానం ఆరంభించగా దేవిశ్రీ ప్రసాద్ చాలా చిన్న వయసులోనే 1999లో లాంచ్ అయ్యాడు. నిజానికి ఇద్దరి మధ్య కెరీర్ గ్యాప్ 9 సంవత్సరాలే. కీరవాణి గత కొంత కాలంగా సినిమాలు తగ్గించుకున్నారు. చేసినవాటిలోనూ చెప్పుకోదగ్గ సంగీతాన్ని ఇవ్వలేకపోయారు. […]
టాలీవుడ్ లోనే కాదు ఇండియా మొత్తం మీద క్రేజీ ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇంకో జూలైలోపు పూర్తి కానుంది. ఆపై నాలుగైదు నెలలు పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ప్రమోషన్ కోసం ప్లాన్ చేసుకున్న జక్కన్న ఈసారి బాహుబలి రికార్డులను తనే బద్దలు కొట్టాలని గట్టి నిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ “రామ రావణ రాజ్యం”గా ఫిక్సయ్యిందని ఓ మీడియాలో వస్తున్న వార్తలు […]
సాధారణంగా సంగీత దర్శకుడు ఎవరైనా ఓ వెలుగు వెలిగి తర్వాత ఫామ్ కోల్పోయి మళ్ళీ కం బ్యాక్ అవ్వడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఏఆర్ రెహమాన్ సైతం మునుపటి మేజిక్ చేయలేక ఏదో బ్రాండ్ తో నెట్టుకొస్తున్నాడు కానీ ఇతని మ్యూజిక్ అభిమానులకు సైతం పెద్దగా కిక్ ఇవ్వడం లేదు. ఇళయరాజా, కోటి, కీరవాణి లాంటి అగ్రజులంతా అడపాదడపా సినిమాలు చేస్తున్నారు కానీ కెరీర్ బెస్ట్ ఆల్బమ్స్ అయితే రేర్ గా వస్తున్నాయి. మణిశర్మ […]