iDreamPost

పాత కారును తక్కువకు అమ్మేస్తున్నారా? ఇలా చేస్తే.. ఎక్కువ డబ్బు పొందవచ్చు!

మీ కారును చాలా ఏళ్లుగా వాడుతున్నాాారా? అయితే కేంద్రం తీసుకొచ్చిన పాలసీ ద్వాారా తుక్కుగా మార్చి కొత్తది తీసుకుంటే రాయితీ లభిస్తుంది. తక్కువకే అమ్ముకునే బదులు ఇలా చేస్తే ఎక్కువ డబ్బు అందుకోవచ్చు.

మీ కారును చాలా ఏళ్లుగా వాడుతున్నాాారా? అయితే కేంద్రం తీసుకొచ్చిన పాలసీ ద్వాారా తుక్కుగా మార్చి కొత్తది తీసుకుంటే రాయితీ లభిస్తుంది. తక్కువకే అమ్ముకునే బదులు ఇలా చేస్తే ఎక్కువ డబ్బు అందుకోవచ్చు.

పాత కారును తక్కువకు అమ్మేస్తున్నారా? ఇలా చేస్తే.. ఎక్కువ డబ్బు పొందవచ్చు!

కరోనా అనంతరం చాలామంది వ్యక్తిగత వాహనాల వినియోగానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వాయు కాలుష్యం కూడా పెరిగింది. అయితే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వాలు కొత్త పాలసీలను ప్రవేశపెడుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువ కాలం వాడకంలో ఉన్న వాహనాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెహికిల్ స్క్రాపేజీ పాలసీని తీసుకొచ్చింది ప్రభుత్వం. దీంతో పాత కార్లు ఉన్నవారికి బంపరాఫర్ ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వాయు కాలుష్యాన్ని నివారించేందుకు పాత కార్లను తుక్కుగా మార్చి కొత్త వాటిని కొనుగోలు చేసే వారికి ప్రోత్సాహకాలను ప్రకటించింది.

కేంద్రం తీసుకొచ్చిన స్క్రాపేజీ పాలసీ ప్రకారం.. మీ పాత వాహనాన్ని తుక్కుగా మార్చి కొత్తది కొనుగోలు చేయాలని భావిస్తే.. రాయితీలను అందించనుంది. కస్టమర్లు వాహన ధరలో లేదా రోడ్డు పన్నులో 25 శాతం వరకు రాయితీని పొందవచ్చు. వాణిజ్య వాహనాలకు 15 శాతం రాయితీ అందిస్తారు. వాయు కాలుష్యంతో ప్రజలు అనేక వ్యాధుల భారిన పడుతున్నారు. అలాగే వాతావరణ మార్పులకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కాలుష్యానికి కారణమయ్యే వాహనాలను తుక్కుగా మార్చాలని నిర్ణయించింది. ఈ స్క్రాపేజ్ పాలసీ దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతోంది. ఆయా రాష్ట్రాలు కస్టమర్లకు రాయితీలను అందిస్తున్నాయి.

స్క్రాపేజ్ విధానం ప్రకారం 15 ఏళ్లు పైబడిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్లు పైబడిన ప్యాసింజర్ వాహనాలు ఫిట్‌‌‌‌నెస్, పొల్యూషన్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. 2024 నిబంధనల ప్రకారం ఎల్​సీవీలు ఆరున్నర సంవత్సరాలు లేదా 1,50,000 కి.మీలు. భారీ వాణిజ్య వాహనాలు 10 సంవత్సరాలు లేదా 4,00,000 కి.మీలు. అన్ని ఇతర వాహనాల గరిష్ట జీవితకాలం 15 సంవత్సరాల తర్వాత వాటిని తుక్కుగా మార్చుతారు. 2021లో వెహికల్ స్క్రాప్ పాలసీని ప్రవేశపెట్టినప్పటి నుంచి దాదాపు 70 వేల పాత వాహనాలు, చాలా వరకు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలకు చెందినవి స్వచ్ఛందంగా తుక్కుగా మార్చారు. మరి మీ పాత కారును తక్కువ ధరకే అమ్మడం కంటే స్క్రాపేజీ పాలసీ ద్వారా ఎక్కువ డబ్బు ఆదా చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి