iDreamPost

HYDలో ఈ ఏరియాల్లో గజం స్థలం 10 వేలే! ఫ్యూచర్‌లో లక్షయినా ఆశ్చర్యపోనవసరం లేదు

హైదరాబాద్ లో 10 వేలకే గజం స్థలం దొరుకుతుంది. అంటే 100 గజాల స్థలానికి 10 లక్షలు అవుతుంది. ఇంకా అదిరిపోయే గుడ్ న్యూస్ ఏంటంటే.. 6 లక్షలకే 100 గజాల స్థలం దొరుకుతుంది. ఎక్కడో తెలియాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదివేయండి.  

హైదరాబాద్ లో 10 వేలకే గజం స్థలం దొరుకుతుంది. అంటే 100 గజాల స్థలానికి 10 లక్షలు అవుతుంది. ఇంకా అదిరిపోయే గుడ్ న్యూస్ ఏంటంటే.. 6 లక్షలకే 100 గజాల స్థలం దొరుకుతుంది. ఎక్కడో తెలియాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదివేయండి.  

HYDలో ఈ ఏరియాల్లో గజం స్థలం 10 వేలే! ఫ్యూచర్‌లో లక్షయినా ఆశ్చర్యపోనవసరం లేదు

హైదరాబాద్ లో పది వేలకు గజం స్థలం ఎక్కడ దొరుకుతుంది బాబు. కల గన్నావా ఏంటి అని అనుకోకండి. హైదరాబాద్ అంటే మరీ సెంట్రల్ హైదరాబాద్ లోనో.. హైదరాబాద్ లోపల అని కాదు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో. బాబోయ్ శివారు ప్రాంతాలా అని కంగారుపడకండి. ఇప్పుడు రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ అనేవి డెవలప్ అయ్యాయి. భవిష్యత్తులో ట్రాఫిక్ కి చెక్ పెట్టేలా కనెక్టివిటీని మరింత సులభతరం చేయనున్నారు. అప్పుడు శివారు ప్రాంతాల నుంచి నగరంలోకి సులువుగా రావచ్చు. టైం కూడా ఆదా అవుతుంది. నగర శివారు ప్రాంతాల్లో నివసించాలని రూల్ ఏముంది.

పెట్టుబడి ప్రపంచంలో ఎక్కడున్నా ఏ చోటైనా పెట్టచ్చు కదా. ఇప్పుడు గజం పదివేలకు స్థలం కొని పక్కన పెట్టుకుంటే ఫ్యూచర్ లో దాని విలువ 50 వేలు, లక్ష అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. హైదరాబాద్ లో యాచారం, చౌటుప్పల్, చేవెళ్ల ఏరియాల్లో చదరపు అడుగు స్థలం 1200 రూపాయలుగా ఉంది. అంటే గజం రూ. 10,800 పడుతుంది. ఈ లెక్కన ఒక 100 గజాల స్థలం కొనాలంటే రూ. 10,80,000 అవుతుంది. సుమారు 11 లక్షలకు వంద గజాల స్థలం సొంతం చేసుకోవచ్చు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే.. 6 లక్షలకు 100 గజాల స్థలం అందుబాటులో ఉన్నాయి.   

ఈ ఏరియాల్లోనే ఎందుకు పెట్టుబడి పెట్టాలి?    

యాచారం:

యాచారంలో చూసుకుంటే అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయబడిన యాచారం ఫార్మా సిటీ పెట్టిన పెట్టుబడుల దృష్ట్యా అక్కడ భూముల విలువ అనేది పెరిగింది. ఫార్మాసూటికల్ కంపెనీలకు హబ్ గా యాచారంలో ఫార్మా సిటీని డెవలప్ చేయడానికి.. అలానే తెలంగాణను దేశం యొక్క ఫార్మాస్యూటికల్ రాజధానిగా నిలపాలని తెలంగాణ ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్, శ్రీశైలం హైవేల మధ్య ఉంది. షాద్ నగర్ రైల్వేస్టేషన్ కు, అలానే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉంది. ఈ ఫార్మా సిటీలో పెట్టుబడి పెట్టేందుకు దాదాపు 400 కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని వల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరకడమే రెసిడెన్షియల్ ఏరియాగా డిమాండ్ ఏర్పడుతుంది. రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా సహా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వృద్ధి అనేది చూడచ్చు. అలానే యాచారంలో పలు పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. ఈ కారణంగా పిల్లలు కలిగిన కుటుంబాలకు ఆకర్షణీయమైన ప్రాంతంగా ఉంది.   

చౌటుప్పల్:

హైదరాబాద్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో చౌటుప్పల్ ఒకటి. స్ట్రాటజిక్ లొకేషన్, అభివృద్ధి చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉన్న కారణంగా చౌటుప్పల్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా చాలా మంది ఎంచుకుంటున్నారు. ఇక్కడ కొన్ని ఏరియాల్లో గజం 6 వేల రేంజ్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే వంద గజాల స్థలం మీకు 6 లక్షలకే దొరికేస్తుంది. గజం 20 వేలు ఉన్న స్థలాలు కూడా ఉన్నాయి. చౌటుప్పల్ ప్రాంతం వ్యవసాయానికి.. అలానే హార్టికల్చర్ ఉత్పత్తికి అనువైన ప్రాంతంగా ఉంది. వ్యవసాయ సంబంధిత వ్యాపారాలకు చౌటుప్పల్ బెస్ట్ డెస్టినేషన్ అని చెప్పవచ్చు. అలానే ఇక్కడ ప్రభుత్వం.. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ వంటి చిన్న వ్యాపార సంస్థల కోసం ఇండస్ట్రియల్ పార్క్స్ ని క్రియేట్ చేస్తుంది. ఈ పార్కులలో రెసిడెన్షియల్ ఫెసిలిటీస్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్, పనికి నడిచి వెళ్లేలా ఒక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ సరసమైన ధరకి దొరకడమే కాకుండా.. భద్రతపరంగా బాగుంటుందని.. ఫ్యూచర్ లో ఏరియా చాలా అభివృద్ధి చెందుతుందని కొంతమంది అంటున్నారు. కాలుష్యం లేని వాతావరణం.. అలానే ఇక్కడ అత్యధిక రీసేల్ వేల్యూ ఉంటుందని ఇంకొంతమంది చెబుతున్నారు. కాబట్టి చౌటుప్పల్ పెట్టుబడులకు అనువైన ప్రదేశం అని చెప్పవచ్చు. 

చేవెళ్ల:

చేవెళ్ల కూడా హైదరాబాద్ నగర శివారులో బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరియాగా ఉంది. చేవెళ్ల అనేది ప్రధాన పెట్టుబడి ఆప్షన్ గా నిపుణులు చెబుతున్నారు. దీని వ్యూహాత్మక స్థానం, మెరుగైన కనెక్టివిటీ, ఆకర్షణీయమైన పెట్టుబడుల హబ్ గా దీన్ని డెవలప్ చేస్తుండడం వంటి కారణాల వల్ల ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. టాటా ఎకో మోటార్, కుందన, కతార, అమెజాన్, ది వెల్ స్పన్ గ్రూప్ వంటి కంపెనీలకు.. అలానే నగర్ గూడ, షాద్ నగర్ జంక్షన్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, చిలుకూరు బాలాజీ టెంపుల్, గచ్చిబౌలి వంటి ఏరియాలకు బాగా దగ్గరలో ఉంది. కాబట్టి ఫ్యూచర్ లో చేవెళ్లకు డిమాండ్ అనేది పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి