iDreamPost

ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమాలాగే నా సామిరంగా కూడా..!

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు.. కానీ తన సంగీతంతో కోట్ల మందిని మంత్ర ముగ్దులను చేసి ఎం ఎం కీరవాణి ఎంత చెప్పినా తక్కువే. ఆర్ఆర్ఆర్ మూవీకి ఏకంగా ఆస్కార్ అవార్డు లభించింది.

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు.. కానీ తన సంగీతంతో కోట్ల మందిని మంత్ర ముగ్దులను చేసి ఎం ఎం కీరవాణి ఎంత చెప్పినా తక్కువే. ఆర్ఆర్ఆర్ మూవీకి ఏకంగా ఆస్కార్ అవార్డు లభించింది.

ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమాలాగే నా సామిరంగా కూడా..!

ఆస్కార్ అవార్డ్ ఉత్సవం తర్వాత మళ్ళీ ఇదే సంగీత దర్శకుడు కీరవాణి మీడియాతో ముచ్చట్లాడింది. పండక్కి నా సామిరంగా రిలీజ్ సందర్భంగా కీరవాణి కొంతసేపు మీడియాతో ఇంటరేక్ట్ అయి ఉల్లాసంగా మాట్లాడారు. తన కెరర్లో నాగార్జునతో కొన్ని సినిమాలకు పనిచేసిన నేపథ్యంలో తొలిచిత్రం ప్రెసిడెంట్ గారి పెళ్ళాం చిత్రంలా నా సామిరంగా చిత్రం కూడా పాటల పరంగా గానీ, సినిమా పరంగా గానీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని ఆయన కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. రీమేక్ చేయడం అంత సులభం కాదని, ఒరిజినల్లో ఉన్న కంటెంట్ ని అలాగే ఉంచుతూ, దానిని మళ్ళీ మన తెలుగు నేటివిటీకి సమపాళ్ళలో మలచి, జనరంజకంగా చేయాలంటే కూడా చాలా తెలివితేటలు కావాలని, అది నాసామిరంగా చిత్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుందని చెప్పారు. రీమేక్ కాబట్టి మూడు నెలల్లో చేయగలిగాడా, లేదా ఏ సినిమానైనా అంత వేగవంతంగా విజయ్ బి తీస్తాడా అన్నది తరువాతి సినిమాకి గానీ నిర్ధారణ జరగదని కూడా వ్యాఖ్యానించాడు. కానీ ఈ సినిమాని మాత్రం చాలా ఆసక్తికరంగా రూపొందించాడని, ఈ సినిమాకి పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చిందని కీరవాణి పదేపదే చెప్పడం విశేషం.

ఆస్కార్ అవార్డ్ వచ్చినంత మాత్రాన ఈ సినిమాలో పాటలు నచ్చాలని, ప్రేక్షకులు  మెచ్చుకుని, అది సినిమా విజయానికి హల్ప్ అవుతుందని ఎక్కడా రాసిపెట్టిలేదని, తనకి నిజానికి అవార్డుల మీద ఎప్పుడూ ఆసక్తి లేనేలేదని, ఒకసారి రామోజీరావుగారు ఆస్కార్ అవార్డు తీసుకురావాలని తనతో అన్నప్పుడుగానీ, అసలు ఆస్కార్ అవార్డు పట్ల తనకి అవగాహనే కుదరలేదని కీరవాణి అన్నారు. ట్రెండ్స్ గురించి మాట్లాడినప్పుడు, ఏరకమైన ట్రెండ్ అయినా ఈ రోజున ఉన్నది చేయాలంటే తన దగ్గర ప్రజెంట్ జనరేషన్ యూత్ తన దగ్గర పనిచేస్తున్నారని, అందువల్ల దానికేం లోటు రాదని, తనే తన టీంలో ఓల్డ్ అని నవ్వుతూ సరదాగా చెప్పారు. క్రిమినల్ సినిమాలో తెలుసా మనసా అనే పాట అప్పుడు దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకూ ఆబాలగోపాలాన్ని ఊపేసిని సందర్భాన్ని గుర్తు చేసుకుని ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకి చేయడాన్ని కంపేర్ చేస్తూ, దానికి దీనికి పెద్ద తేడా ఏంలేదని, పాన్ ఇండియా సినిమాల కోసం కొత్తగా సంగీతం పుట్టుకురాదని చమత్కరించారు.

naa saami ranga like president gari pellam

ఇటీవల వచ్చి బ్లాక్ బస్టర్ అయిన యానిమల్ సినిమా గురించి ప్రస్తావిస్తూ యానిమల్ సినిమా సినిమాగా, తర్వాత సంగీతపరంగా ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా కూడా తనని బాగా ఆకట్టుకుందని అన్నారు. నా సామిరంగాలో కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొత్తగా చేయడం కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టానని తెలియజేశారు. ఇటీవల రిలీజైన తతిమా సినిమాలు ఏవీ చూడలేదని కూడా చెప్పారు.  ప్రారంభం నుంచి లో అండ్ హై పాయంట్స్ కెరీర్లో ఎలా వచ్చాయో చెబుతూ, తన కెరీర్లో కూడా చాలా లో టైమ్స్ ఉన్నాయని, ఎప్పుడూ హైగానే తన కెరీర్ కొనసాగలేదని చెప్పారు. రాఘవేంద్రరావు, తర్వాత రాజమౌళి ఇలా పద్ద సినిమాలు చేసినప్పటికీ కూడా, మద్యమధ్యలో జయమ్మ పంచాయితీలాటి చిన్నసినిమాలు కూడా చేశానని, కెరీర్ అంటే ఎప్పుడూ ఒక్కలాగే కొనసాగదని చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి