iDreamPost

ముంబై ఇండియన్స్ కొంపముంచిన స్టార్క్ భార్య.. ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నావమ్మా?

  • Published May 04, 2024 | 4:41 PMUpdated May 04, 2024 | 4:41 PM

కోల్​కతా నైట్ రైడర్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ భార్యను ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు. ఆమె వల్ల తమ టీమ్ కొంపమునిగిందని అంటున్నారు.

కోల్​కతా నైట్ రైడర్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ భార్యను ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు. ఆమె వల్ల తమ టీమ్ కొంపమునిగిందని అంటున్నారు.

  • Published May 04, 2024 | 4:41 PMUpdated May 04, 2024 | 4:41 PM
ముంబై ఇండియన్స్ కొంపముంచిన స్టార్క్ భార్య.. ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నావమ్మా?

ముంబై ఇండియన్స్ జట్టు పనైపోయింది. ఐపీఎల్-2024లో ఎన్నో ఎక్స్​పెక్టేషన్స్​తో బరిలోకి దిగిన ఆ టీమ్ ఈసారి కనీసం ప్లేఆఫ్స్​కు వెళ్తుందని అంతా భావించారు. కానీ గ్రూప్ దశ నుంచే ఆ జట్టు వెనుదిరగాల్సిన పరిస్థితి. ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకోవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్​లో కోల్​కతా నైట్ రైడర్స్ చేతుల్లో 24 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమితో పాయింట్స్ టేబుల్​లో ఆర్సీబీని దాటుకొని కిందకు వెళ్లిపోయింది హార్దిక్ సేన. ఆ జట్టు గ్రూప్ స్టేజ్ నుంచి ఎగ్జిట్ అవ్వనుంది. అయితే ఈ మ్యాచ్​లో​ ఓటమికి కేకేఆర్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ భార్య అలీసా హీలేనే కారణమని కొందరు తప్పుబడుతున్నారు. ఆమె రావడం వల్లే ముంబై పుట్టి మునిగిందని కామెంట్స్ చేస్తున్నారు.

ముంబై ఇండియన్స్ ఓటమికి స్టార్క్ వైఫ్ అలీసానే కారణమని కొందరు ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. ఈ ఐపీఎల్​లో ఏ మ్యాచ్​కూ రాని ఆమె స్పెషల్​గా ఎంఐ మ్యాచ్​కే వచ్చిందని అంటున్నారు. 25 కోట్ల ఆటగాడైన స్టార్క్ క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్​లో అట్టర్​ఫ్లాప్ అవుతున్నాడు. వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు ఇచ్చుకుంటూ టీమ్​కు పెద్ద తలనొప్పిగా మారాడు. అయినా కూడా మెంటార్ గౌతం గంభీర్​తో పాటు కేకేఆర్ మేనేజ్​మెంట్​ వరుస అవకాశాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే వాంఖడే వేదికగా ముంబైతో నిన్న జరిగిన మ్యాచ్​లోనూ ఆడించింది. అయితే వరుసగా దారుణ ప్రదర్శనలతో విమర్శల పాలవుతున్న స్టార్క్.. ఎంఐ మీద మాత్రం జూలు విదిల్చాడు.

ముంబై మీద 3.5 ఓవర్లు వేసిన స్టార్క్ 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్​ను క్లీన్ బౌల్డ్ చేసిన కేకేఆర్ పేసర్.. ఆ తర్వాత ఆఖరి ఓవర్లలో మరింత చెలరేగిపోయాడు. టిమ్ డేవిడ్, పీయుష్ చావ్లాను కూడా పెవిలియన్​కు పంపించాడు. చివర్లో గెరాల్డ్ కొయెట్జీని క్లీన్ బౌల్డ్ చేసి కేకేఆర్​కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. తన పెర్ఫార్మెన్స్​తో భార్యను ఇంప్రెస్ చేయాలనుకున్నాడో ఏమో స్టార్క్ మరింత పట్టుదలతో బౌలింగ్ చేశాడు. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తూ డెడ్లీ యార్కర్స్, బౌన్సర్స్​తో ముంబై బ్యాటర్లను అల్లాడించాడు. దీంతో అలీసా రాకపోతే ఎంఐ నెగ్గేదని, ఆమె రాకతో స్టార్క్ చెలరేగాడని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే కోల్​కతా అభిమానులు మాత్రం తనకు ఇచ్చిన భారీ ధరకు స్టార్క్ ఫస్ట్ టైమ్ న్యాయం చేశాడని చెబుతున్నారు. ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నావమ్మా.. నువ్వు ఇలాగే కేకేఆర్ మ్యాచ్​లకు వస్తూ ఉండాలని అలీసాను కోరుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి